కోహ్లి తర్వాత రోహిత్‌ అత్యుత్తమం

Wasim Jaffer Picks Kohli As The Best All Format Batsman - Sakshi

ముంబై : ఈ తరం గొప్ప ఆటగాళ్లుగా పేరుగాంచిన విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌లలో ఎవరు అత్యుత్తమం అనేదానిపై క్రికెట్‌ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ అంశంపై మాట్లాడిన తాజా, మాజీ ఆటగాళ్లు ఎవరికి వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఏడాది పాటు నిషేదం ఎదుర్కొని తిరిగొచ్చి మళ్లీ టెస్టుల్లో నంబర్‌ వన్‌ స్థానాన్ని అధిరోహించిన స్టీవ్‌ స్మిత్‌ టెస్టు క్రికెట్‌లో గొప్ప బ్యాట్స్‌మన్‌ అంటూ పలువురు పేర్కొంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్‌ వసీం జాఫర్‌ కూడా వ్యక్తం చేశాడు. (ఆ జాబితాలో కోహ్లికి ఆరో స్థానం)

టెస్టు క్రికెట్‌లో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి కంటే స్టీవ్‌ స్మిత్‌ గొప్ప బ్యాట్స్‌మని పేర్కొన్నాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం నుంచి తేరుకొని అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే మళ్లీ నంబర్‌ వన్‌ స్థానానికి స్మిత్‌ ఎగబాకిన విషయాన్ని జాఫర్‌ గుర్తుచేశాడు. అంతేకాకుండా ఏడాది పాటు టెస్టు క్రికెట్‌ దూరంగా ఉన్నప్పటికీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లోనే కొనసాగిన విషయాన్ని ప్రస్తావించాడు. అయితే మూడు ఫార్మట్లలో కలిపి బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ కోహ్లి నిలుస్తాడని తెలిపాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లి తర్వాత రోహిత్‌ శర్మ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. (‘కోహ్లి గురించి ఒక్క మాట చెడుగా చెప్పను’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top