టీమిండియాకు అతడితోనే ఇబ్బందులు: వీవీఎస్‌

VVS Laxman Believes Malik Play Key Role Against India - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌: ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్‌ ముగిసింది. ఇక యూఏఈ వేదికగా జరుగనున్న ఆసియా కప్‌పై అందరి చూపు పడింది. ప్రత్యేకంగా ఈ నెల 19న జరగబోయే భారత్‌-పాకిస్తాన్‌ల మ్యాచ్‌పైనే అందరీ దృష్టి కేంద్రీకరించింది. చాంపియన్‌ ట్రోఫీ అనంతరం దాయాదుల పోరును అభిమానులు ఆసియాకప్‌లో చూడనున్నారు. అయితే రోహిత్‌ సేనకు షోయాబ్‌ మాలిక్‌ రూపంలో ఇబ్బందులు తప్పవంటున్నాడు టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌. ప్రస్తుతం పాకిస్తాన్‌ జట్టులో అత్యంత సీనియర్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ మాలిక్‌ ఆ జట్టుకు కీలకం కానున్నాడని ఈ దిగ్గజ ఆటగాడు అభిప్రాయపడ్డాడు. 

‘మిడిల్‌ ఓవర్లలో రోహిత్‌ శర్మ ఖచ్చితంగా స్పిన్నర్లతో అటాకింగ్‌ చేపిస్తాడు. కానీ స్ట్రైక్‌ రోటేట్‌ చేయడం, స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం మాలిక్‌కు కొట్టినపిండి. ప్రత్యేకంగా టీమిండియా అంటే అతడు చెలరేగి ఆడుతాడని గత రికార్డులే పేర్కొంటున్నాయి. కుల్దీప్‌, చహల్‌ వంటి మణికట్టు స్పిన్నర్లు ఉన్నప్పటికీ.. మాలిక్‌ కోసం ప్రత్యేక వ్యూహాలు రచించాలి.  ఫఖర్‌ జామన్‌, బాబర్‌ అజామ్‌ వండి విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ ఉండటం పాక్‌కు బలం’ అంటూ సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మన్‌ పేర్కొన్నాడు. 

       

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top