వివేక్, పలక్‌లకు టైటిల్స్‌ | Vivek and palak win TT titles | Sakshi
Sakshi News home page

వివేక్, పలక్‌లకు టైటిల్స్‌

Aug 21 2017 10:47 AM | Updated on Sep 17 2017 5:48 PM

వివేక్, పలక్‌లకు టైటిల్స్‌

వివేక్, పలక్‌లకు టైటిల్స్‌

తెలంగాణ స్టేట్‌ ర్యాంకింగ్‌ ఇంటర్‌ స్కూల్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నమెంట్‌లో వివేక్‌ సాయి, జి.పలక్‌ సత్తా చాటారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ ర్యాంకింగ్‌ ఇంటర్‌ స్కూల్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నమెంట్‌లో వివేక్‌ సాయి, జి.పలక్‌ సత్తా చాటారు. హైదర్‌గూడలోని సెయింట్‌ పాల్స్‌ హైస్కూల్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో క్యాడెట్‌ బాలబాలికల విభాగాల్లో వీరిద్దరూ విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన క్యాడెట్‌ బాలుర ఫైనల్లో వివేక్‌ సాయి (హెచ్‌వీఎస్‌) 2–11, 11–6, 11–7, 13–11తో ఆయుష్‌ (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందాడు. సెమీస్‌ మ్యాచ్‌ల్లో ఆయుష్‌ 13–11, 7–11, 8–11, 11–8, 11–7తో జతిన్‌ దేవ్‌ (ఎస్‌పీహెచ్‌ఎస్‌)పై, వివేక్‌ 11–9, 11–13, 11–9, 11–5తో ఇషాంత్‌ (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు. బాలికల విభాగంలో పలక్‌ (జీఎస్‌ఎం) 8–11, 11–7, 11–2, 11–4తో మెర్సీని ఓడించింది. సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో మెర్సీ 11–3, 11–7, 11–2తో ప్రీతిపై, పలక్‌ 11–6, 14–12, 11–6తో అనన్య (జీఎస్‌ఎం)పై గెలుపొందారు.  

ఇతర విభాగాల వివరాలు


జూనియర్‌ బాలుర క్వార్టర్స్‌: సరోజ్‌ సిరిల్‌ (ఎంఎల్‌ఆర్‌) 11–2, 11–4, 11–4, 11–6తో అనూప్‌ (స్టాగ్‌ అకాడమీ)పై, అమన్‌ ఉల్‌ రహమాన్‌ (స్టాగ్‌ అకాడమీ) 11–8, 11–7, 11–4, 11–2తో సౌరభ్‌పై, కేశవన్‌ (ఎంఎల్‌ఆర్‌) 11–8, 11–13, 11–3, 9–11, 11–4, 8–11, 12–10తో విశాల్‌ (జీఎస్‌ఎం)పై, సాయి తేజేశ్‌ (జీఎస్‌ఎం) 14–12, 8–11, 9–11, 4–11, 11–6, 11–9, 11–8తో అద్వైత్‌ (ఏడబ్ల్యూఏ)పై నెగ్గారు.

పురుషుల క్వార్టర్స్‌: అరవింద్‌  7–11, 15–13, 11–8, 11–7, 11–8తో అమన్‌పై, సాయి తేజేశ్‌ 11–8, 11–7, 11–6, 4–11, 11–8తో జుబేర్‌ ఫరూఖిపై, చంద్రచూడ్‌ (జీఎస్‌ఎం) 11–8, 11–8, 11–8, 11–6తో హర్‌‡్ష లహోటి (హెచ్‌వీఎస్‌)పై గెలిచారు.
మహిళల క్వార్టర్స్‌: నైనా 11–9, 11–4, 11–5, 12–10తో పలక్‌ షాపై, మోనిక 11–4, 14–12, 11–5, 11–9తో లాస్యపై, ప్రణీత 11–8, 11–7, 11–8, 11–8తో వినిచిత్ర యాదవ్‌ (స్టాగ్‌ అకాడమీ)పై నెగ్గారు.

సబ్‌ జూనియర్‌ బాలుర సెమీఫైనల్‌: అద్వైత్‌ 12–10, 6–11, 12–10, 12–10, 11–6తో వెంకట ధనుశ్‌పై, కేశవన్‌ 7–11, 9–11, 8–11, 11–4, 12–10, 11–6, 11–2తో కార్తీక్‌పై విజయం సాధించారు.  


బాలికలు: అంజలి 11–13, 11–9, 9–11, 11–7, 11–8, 7–11, 11–8తో ఐశ్వర్యపై, మెర్సీ 12–10, 11–8, 4–11, 7–11, 8–11, 11–9, 11–9తో భవితపై గెలుపొందారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement