breaking news
Inter school Table Tennis
-
సెయింట్ పాల్స్ జట్లకు టైటిల్స్
ఇంటర్ స్కూల్ టీటీ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో సెయింట్ పాల్స్ స్కూల్ జట్లు సత్తా చాటాయి. మలక్‌పేట్‌లోని స్టాగ్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో జూనియర్, సీనియర్ బాలుర టీమ్ విభాగాల్లో విజేతగా నిలిచి టైటిళ్లను దక్కించుకున్నాయి. బుధవారం జరిగిన జూనియర్ బాలుర టీమ్ ఈవెంట్లో సెయింట్ పాల్స్ హైస్కూల్ 3–1తో చిరెక్ పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించింది. సెయింట్ పాల్స్ తరఫున జతిన్ 3–2తో అథర్వపై, త్రిశూల్ 3–2తో ఆయుశ్పై, త్రిశూల్ 3–2తో అథర్వపై గెలుపొందారు. సీనియర్ బాలుర టీమ్ ఫైనల్లోనూ సెయింట్ పాల్స్ హైస్కూల్ జట్టు 3–1తో ప్రకాశం విద్యానికేతన్ హైస్కూల్‌ను ఓడించింది. విజేత జట్టు తరఫున అనూప్ 3–1తో రాజుపై, యశ్ 3–0తో నితిన్‌పై, అనూప్ 3–0తో నితిన్‌పై విజయం సాధించారు. బాలికల విభాగంలో చిరెక్ ఇంటర్నేషనల్, గీతాంజలి దేవాశ్రయ్ జట్లు విజేతలుగా నిలిచాయి. జూనియర్ బాలికల టీమ్ ఈవెంట్ ఫైనల్లో చిరెక్ పబ్లిక్ స్కూల్ (కొండాపూర్) 3–0తో సెయింట్ పాల్స్ హైస్కూల్‌పై నెగ్గింది. చిరెక్ తరఫున సింగిల్స్ మ్యాచ్‌ల్లో అనన్య 3–0తో ఆశ్లేషపై, పూజ 3–2తో ప్రియాంక రాజ్‌పై గెలుపొందగా, డబుల్స్ కేటగిరీలో అనన్య–పూజ ద్వయం 3–0తో ఆశ్లేష–ప్రియాంక రాజ్ జంటపై నెగ్గింది. సీనియర్ బాలికల ఫైనల్లో గీతాంజలి దేవాశ్రయ్ 3–2తో రోజరీ కాన్వెంట్ హైస్కూల్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. గీతాంజలి జట్టులో భవిత 3–1తో కీర్తనపై, 3–0తో ఇక్షితపై విజయం సాధించగా, డబుల్స్ కేటగిరీలో విధి– భవిత జంట 3–1తో ఇక్షిత–కీర్తన జోడీపై నెగ్గింది. -
వివేక్, పలక్‌లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ ఇంటర్ స్కూల్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో వివేక్ సాయి, జి.పలక్ సత్తా చాటారు. హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ హైస్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో క్యాడెట్ బాలబాలికల విభాగాల్లో వీరిద్దరూ విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన క్యాడెట్ బాలుర ఫైనల్లో వివేక్ సాయి (హెచ్‌వీఎస్) 2–11, 11–6, 11–7, 13–11తో ఆయుష్ (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందాడు. సెమీస్ మ్యాచ్‌ల్లో ఆయుష్ 13–11, 7–11, 8–11, 11–8, 11–7తో జతిన్ దేవ్ (ఎస్పీహెచ్ఎస్)పై, వివేక్ 11–9, 11–13, 11–9, 11–5తో ఇషాంత్ (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు. బాలికల విభాగంలో పలక్ (జీఎస్ఎం) 8–11, 11–7, 11–2, 11–4తో మెర్సీని ఓడించింది. సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో మెర్సీ 11–3, 11–7, 11–2తో ప్రీతిపై, పలక్ 11–6, 14–12, 11–6తో అనన్య (జీఎస్ఎం)పై గెలుపొందారు. ఇతర విభాగాల వివరాలు జూనియర్ బాలుర క్వార్టర్స్: సరోజ్ సిరిల్ (ఎంఎల్ఆర్) 11–2, 11–4, 11–4, 11–6తో అనూప్ (స్టాగ్ అకాడమీ)పై, అమన్ ఉల్ రహమాన్ (స్టాగ్ అకాడమీ) 11–8, 11–7, 11–4, 11–2తో సౌరభ్‌పై, కేశవన్ (ఎంఎల్ఆర్) 11–8, 11–13, 11–3, 9–11, 11–4, 8–11, 12–10తో విశాల్ (జీఎస్ఎం)పై, సాయి తేజేశ్ (జీఎస్ఎం) 14–12, 8–11, 9–11, 4–11, 11–6, 11–9, 11–8తో అద్వైత్ (ఏడబ్ల్యూఏ)పై నెగ్గారు. పురుషుల క్వార్టర్స్: అరవింద్ 7–11, 15–13, 11–8, 11–7, 11–8తో అమన్‌పై, సాయి తేజేశ్ 11–8, 11–7, 11–6, 4–11, 11–8తో జుబేర్ ఫరూఖిపై, చంద్రచూడ్ (జీఎస్ఎం) 11–8, 11–8, 11–8, 11–6తో హర్‡్ష లహోటి (హెచ్‌వీఎస్)పై గెలిచారు. మహిళల క్వార్టర్స్: నైనా 11–9, 11–4, 11–5, 12–10తో పలక్ షాపై, మోనిక 11–4, 14–12, 11–5, 11–9తో లాస్యపై, ప్రణీత 11–8, 11–7, 11–8, 11–8తో వినిచిత్ర యాదవ్ (స్టాగ్ అకాడమీ)పై నెగ్గారు. సబ్ జూనియర్ బాలుర సెమీఫైనల్: అద్వైత్ 12–10, 6–11, 12–10, 12–10, 11–6తో వెంకట ధనుశ్‌పై, కేశవన్ 7–11, 9–11, 8–11, 11–4, 12–10, 11–6, 11–2తో కార్తీక్‌పై విజయం సాధించారు. బాలికలు: అంజలి 11–13, 11–9, 9–11, 11–7, 11–8, 7–11, 11–8తో ఐశ్వర్యపై, మెర్సీ 12–10, 11–8, 4–11, 7–11, 8–11, 11–9, 11–9తో భవితపై గెలుపొందారు.