చాంప్స్‌ విష్ణు, దియా | Vishnu, Diya won TT Titles | Sakshi
Sakshi News home page

చాంప్స్‌ విష్ణు, దియా

Aug 4 2018 10:26 AM | Updated on Aug 4 2018 10:26 AM

Vishnu, Diya won TT Titles - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణ రీజినల్‌ ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో బి. విష్ణు, దియా చాంపియన్‌లుగా నిలిచారు. సీనియర్‌ బాలుర ఫైనల్లో జ్ఞాన రేవంత్‌ (ఫ్యూచర్‌ కిడ్స్‌)పై విష్ణు (గీతాంజలి) గెలుపొందాడు. హృదయ్‌ షా (గీతాంజలి) మూడో స్థానంలో నిలిచాడు. బాలికల ఫైనల్లో మధుమాల (నాసర్‌ స్కూల్, ఖైరతాబాద్‌)పై దియా (నాసర్‌ స్కూల్‌) నెగ్గింది. సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌ స్కూల్‌ కింగ్‌కోఠికి చెందిన దిశా సంఘ్వి మూడో స్థానాన్ని దక్కించుకుంది.

 
ఇతర వయో విభాగాల విజేతల వివరాలు

జూనియర్‌ బాలురు: 1. ఫణీంద్ర (సెయింట్‌ ఆన్స్, రాజమండ్రి), 2. ఒమర్‌ మంజూర్‌ ఖాన్‌ (నాసర్‌ స్కూల్, గచ్చిబౌలి), 3. రవివర్మ (సెయింట్‌ జాన్స్, వైజాగ్‌); బాలికలు: 1. ఛార్వి ఫల్గుణ్‌ (ఫ్యూచర్‌ కిడ్స్, రాజమండ్రి), 2. టి. అంకిత (టింపనీ స్కూల్, వైజాగ్‌), 3. టి. ఆశ్రిత (టింపనీ స్కూల్, వైజాగ్‌).  

జూనియర్‌ బాలుర డబుల్స్‌: 1. కృషాల్‌– లక్ష్య (ఫ్యూచర్‌కిడ్స్‌), 2. జి.మోహిత్‌–  ఆకర్ష్‌ (ఫ్యూచర్‌కిడ్స్‌), 3. శ్రీవాస్తవ–మహంతి (హెచ్‌పీఎస్, బేగంపేట్‌); బాలికలు: ఫాతిమా–రషిక (నాస ర్‌ స్కూల్‌), 2. అమారా– ఈషా (నాసర్‌ స్కూల్‌), 3. హితశ్రీ–సాత్విక (టింపనీ స్కూల్‌).

సీనియర్‌ బాలుర డబుల్స్‌: 1. ఆర్యన్‌–అనికేత్‌ (గీతాంజలి), 2. బిస్మాన్‌–గౌరవ్‌ (ఫ్యూచర్‌ కిడ్స్‌), 3. కుంజ్‌ గుప్తా–వన్‌‡్ష (గీతాంజలి); బాలికలు: ఉర్వా– హన్నా రెహమాన్‌ (నాసర్‌ స్కూల్‌), 2. ఖుషి–స్మృతి (నాసర్‌ స్కూల్‌), 3. ముస్కాన్‌–సంస్కృతి (సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌ స్కూల్‌).

Advertisement
 
Advertisement
Advertisement