ఐపీఎల్‌ వేలంపై సెహ్వాగ్‌  సెటైర్‌

Virender Sehwags tweet on Preity Zinta - Sakshi

సాక్షి, బెంగళూరు : ట్వీటర్‌లో ప్రతివిషయంపై వ్యంగ్యంగా స్పందించే టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఐపీఎల్‌ వేలంను సైతం విడిచిపెట్టలేదు. బెంగళూరు వేదికగా ఐపీఎల్-11 కోసం ఆటగాళ్ల వేలం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫ్రాంచైజీలు ఉత్తమ ఆటగాళ్లను దక్కించుకొనేందుకు కోట్లానుకోట్ల రూపాయలతో పోటీపడుతున్నాయి. ఈ వేలంలో కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌కు మెంటర్‌గా పాల్గొన్న సెహ్వాగ్ ఫ్రాంచైజీ సహ యజమానైన ప్రితీజింతాపై సెటైరిక్‌ ట్వీట్‌ చేశాడు.

‘సాధారణంగా అమ్మాయిలకు షాపింగ్‌ అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు ప్రీతి ఫుల్‌ షాపింగ్‌ మూడ్‌లో ఉంది. ఏదీ కనిపించినా కొనుగోలు చేస్తోంది.’ అని ట్వీట్‌ చేశాడు. ఇక ఆటగాళ్ల వేలంపై సైతం తనదైన శైలిలో స్పందించాడు.

‘‘చిన్నప్పుడు మనం కూరగాయలు కొనేందుకు వెళితే.. అమ్మ ధర సరిగ్గా చూసి కొనమని చెప్పేది. ఇప్పుడు మేం ఆటగాళ్లను కొనడానికి వెళ్తున్నాం. తేడా ఏంటంటే.. ఇప్పుడు ఓనర్ చెబుతారు.. సరైన ధరకి కొనమని’’ అంటూ సెహ్వాగ్ ట్వీట్‌ చేశాడు.

ఇక కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌ రిటైన్‌ పద్దతిలో అక్సర్‌ పటేల్‌ను అంటిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు జరిగిన వేలంలో కేఎల్‌ రాహుల్‌కు అత్యధికంగా రూ.11 కోట్లు వెచ్చించగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌ను రూ.7.6 కోట్లతో కొనుగోలు చేసింది. 

కింగ్స్‌ పంజాబ్‌ దక్కించుకున్న ఆటగాళ్లు
అరోన్‌ ఫించ్                - 6.2 కోట్లు
మార్కస్‌ స్టోయినిస్‌    - 6.2 కోట్లు
కరుణ్‌ నాయర్‌           -  5.6 కోట్లు
డేవిడ్‌ మిల్లర్‌              -  3 కోట్లు
యువరాజ్‌ సింగ్‌        - 2 కోట్లు
మయాంక్‌ అగర్వాల్‌  - రూ. కోటి
అంకిత్‌ రాజ్‌పుత్‌       - రూ. 3 కోట్లు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top