కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో కోహ్లి | Virat Kohli rises to career-best 9th in ICC Test rankings | Sakshi
Sakshi News home page

కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో కోహ్లి

Feb 20 2014 12:56 AM | Updated on Sep 2 2017 3:52 AM

కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో కోహ్లి

కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో కోహ్లి

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రాణించిన భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి... టెస్టుల్లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు.

దుబాయ్: న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రాణించిన భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి... టెస్టుల్లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో 9వ ర్యాంక్‌లో నిలిచాడు. ఈ ఢిల్లీ ప్లేయర్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 214 పరుగులు చేశాడు. చతేశ్వర్ పుజారా 7వ ర్యాంక్‌కు పడిపోయాడు. అజింక్యా రహానే 46వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరోవైపు ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ 8 స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. వాట్లింగ్ 45వ ర్యాంక్‌కు ఎగబాకాడు. బౌలింగ్ విభాగంలో అశ్విన్ రెండు స్థానాలు దిగజారి 10వ ర్యాంక్‌తో సరిపెట్టుకోగా... హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా 12వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement