విరాట్‌ కోహ్లి మరో రికార్డు | Virat Kohli overtakes VVS Laxman | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లి మరో రికార్డు

Dec 8 2018 3:30 PM | Updated on Dec 8 2018 4:27 PM

Virat Kohli overtakes VVS Laxman - Sakshi

అడిలైడ్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో రికార్డు సాధించాడు. ఆసీస్‌ గడ్డపై వెయ్యి పరుగుల్ని వేగవంతంగా సాధించిన భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. తాజాగా అడిలైడ్‌ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. భారత రెండో ఇన్నింగ్స్‌లో  కోహ్లి 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా ఆస్ట్రేలియాలో వెయ్యి టెస్టు పరుగుల మార్కును చేరాడు.

ఆస్ట్రేలియాలో 18 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లి వెయ్యి పరుగులు సాధించి భారత ఆటగాళ్ల జాబితాలో తొలి స్థానంలో నిలిచాడు. ఫలితంగా ఇప్పటివరకూ వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేరిట ఉన్న రికార్డును కోహ్లి బద్ధలు కొట్టాడు. ఆసీస్‌ గడ్డపై లక్ష్మణ్‌ వెయ్యి పరుగులు సాధించడానికి 19 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, కోహ్లి 18 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ ఫీట్‌ను అందుకున్నాడు. ఆస్ట్రేలియాలో వెయ్యి టెస్టు పరుగుల్ని వేగవంతంగా అందుకున్న టీమిండియా క్రికెటర్ల జాబితాలో కోహ్లి, లక్ష్మణ్‌ తర్వాత స్థానాల్లో సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌లు ఉన్నారు. ఇక్కడ సచిన్‌, సెహ్వాగ్‌లు 22 ఇన్నింగ్స్‌ల్లో, ద్రవిడ్‌ 25 ఇన్నింగ్స్‌ల్లో ఆస్ట్రేలియాలో వెయ్యి పరుగుల్ని సాధించారు. ఆసీస్‌తో టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి 34 పరుగులు చేసి ఔటయ్యాడు.

టీమిండియా నిలకడగా..

మేము కోహ్లిలా మొరటోళ్లం కాదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement