కోహ్లిదే అగ్రస్థానం | Virat Kohli is most searched IPL player this season | Sakshi
Sakshi News home page

కోహ్లిదే అగ్రస్థానం

May 8 2014 1:37 AM | Updated on Sep 2 2017 7:03 AM

కోహ్లిదే అగ్రస్థానం

కోహ్లిదే అగ్రస్థానం

ఐపీఎల్-7కు సంబంధించి గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఆటగాళ్ల జాబితాలో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లికి అగ్రస్థానం లభించింది. చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ధోని, డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ (ఆర్‌సీబీ) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

న్యూఢిల్లీ: ఐపీఎల్-7కు సంబంధించి గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఆటగాళ్ల జాబితాలో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లికి అగ్రస్థానం లభించింది. చెన్నై సూపర్‌కింగ్స్ సారథి ధోని, డాషింగ్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ (ఆర్‌సీబీ) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
 
 క్రికెట్ చరిత్రలో సంచలన క్యాచ్ పట్టిన క్రిస్ లిన్ (కేకేఆర్)కు నాలుగో స్థానం దక్కింది. మైదానంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న పంజాబ్ బ్యాట్స్‌మన్ సెహ్వాగ్ ఐదో స్థానం సాధించాడు. గంభీర్, మాక్స్‌వెల్, క్రిస్ గేల్, రైనా, శిఖర్ ధావన్‌లు టాప్-10లో చోటు సంపాదించారు. అయితే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్ సంజయ్ బంగర్ కోసం చాలా మంది అభిమానులు గూగుల్‌లో సెర్చ్ చేయడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement