కుదురుగా ఆడుతున్న టీమిండియా | virat kohli and rahane to build team india score after lose three wickets | Sakshi
Sakshi News home page

కుదురుగా ఆడుతున్న టీమిండియా

Dec 30 2014 9:40 AM | Updated on Sep 2 2017 6:59 PM

కుదురుగా ఆడుతున్న టీమిండియా

కుదురుగా ఆడుతున్న టీమిండియా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో మూడు వికెట్లు కోల్పోయిన అనంతరం టీమిండియా కుదురుగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది.

మెల్ బోర్న్:ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో  మూడు వికెట్లు కోల్పోయిన అనంతరం టీమిండియా కుదురుగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఆదిలోనే కీలక వికెట్లను కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. ఆ తరుణంలో వైఎస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజ్యింకా రహానేలు మరోసారి టీమిండియా స్కోరు బోర్డును చక్కదిద్దే పనిలో పడ్డారు. కోహ్లీ(40), రహానే(22) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. అంతకుముందు టీమిండియా వరుస వికెట్లను కోల్పోయింది.

 

శిఖర్ ధావన్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, కేఎల్ రాహుల్(1), మురళీ విజయ్(11) పరుగులు చేసి అవుటయిన సంగతి తెలిసిందే.384 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ఇంకా 304 పరుగులు అవసరం. ప్రస్తుతం టీమిండియా 80 పరుగులతో  ఆటను కొనసాగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement