వరుణి జైశ్వాల్‌ డబుల్‌ ధమాకా | Varuni Jaiswal gets double Dhamaka | Sakshi
Sakshi News home page

వరుణి జైశ్వాల్‌ డబుల్‌ ధమాకా

Sep 25 2017 10:54 AM | Updated on Sep 25 2017 10:54 AM

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో వరుణి జైశ్వాల్‌ ఆకట్టుకుంది. మహబూబ్‌నగర్‌లో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో ఆమె యూత్‌ బాలికల, మహిళల విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను దక్కించుకుంది. బాలుర విభాగంలో మొహమ్మద్‌ అలీ కూడా జూనియర్‌ బాలుర, పురుషుల కేటగిరీల్లో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన యూత్‌ బాలికల ఫైనల్లో వరుణి జైశ్వాల్‌ (జీఎస్‌ఎం) 13–11, 10–12, 9–11, 16–14, 11–8, 11–6తో ప్రణీత (హెచ్‌వీఎస్‌)పై, మహిళల విభాగంలో వరుణి11–9, 11–8, 8–11, 11–2, 11–9తో మోనికా (జీఎస్‌ఎం)పై గెలుపొందింది. జూనియర్‌ బాలికల విభాగంలో వి. సస్య (ఎంఎల్‌ఆర్‌) 6–11, 12–10, 11–6, 9–11, 11–7, 11–7తో లాస్య (ఎంఎల్‌ఆర్‌)పై నెగ్గింది. మరోవైపు జూనియర్‌ బాలుర ఫైనల్లో మొహమ్మద్‌ అలీ (ఎల్‌బీఎస్‌) 12–10, 11–6, 8–11, 7–11, 11–9, 11–7తో వరుణ్‌ శంకర్‌ (జీటీటీఏ)పై, పురుషుల ఫైనల్లో మొహమ్మద్‌ అలీ 5–11, 14–12, 11–8, 11–9, 13–15, 7–11, 15–13తో చంద్రచూడ్‌పై, యూత్‌ బాలుర ఫైనల్లో సరోజ్‌ సిరిల్‌ 8–11, 13–11, 11–5, 11–7, 8–11, 11–6తో లహోటి (హెచ్‌వీఎస్‌)పై, సబ్‌ జూనియర్‌ బాలుర ఫైనల్లో అద్వైత్‌ 7–11, 11–7, 11–8, 11–9, 11–8తో వరుణ్‌ శంకర్‌పై నెగ్గి విజేతలుగా నిలిచారు.  

Advertisement
 
Advertisement
Advertisement