వరుణి డబుల్‌ ధమాకా | varuni gets double dhamaka | Sakshi
Sakshi News home page

వరుణి డబుల్‌ ధమాకా

Jul 11 2017 10:40 AM | Updated on Sep 5 2017 3:47 PM

వరుణి డబుల్‌ ధమాకా

వరుణి డబుల్‌ ధమాకా

తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో వరుణి జైశ్వాల్‌ సత్తా చాటింది.

టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో వరుణి జైశ్వాల్‌ సత్తా చాటింది. మలక్‌పేట్‌లోని స్టాగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో జూనియర్, యూత్‌ బాలికల విభాగాల్లో విజేతగా నిలిచి టైటిల్స్‌ను కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన జూనియర్‌ బాలికల ఫైనల్లో వరుణి 6–11, 11–7, 11–9, 12–10, 8–11, 11–7తో లాస్యపై గెలుపొందింది.

 

అంతకుముందు జరిగిన సెమీస్‌లో ఆమె 11–6, 11–7, 11–3, 11–5తో సస్యను ఓడించింది. యూత్‌ బాలికల ఫైనల్లో వరుణి 11–7, 11–4, 9–11, 11–7, 11–8తో లాస్యను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. సెమీస్‌లో ఆమె 11–8, 11–4, 11–8, 11–9తో సస్యపై గెలుపొందింది. పురుషుల విభాగంలో ఎస్‌ఎఫ్‌ఆర్‌ స్నేహిత్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో స్నేహిత్‌ (జీటీటీఏ) 6–11, 11–6, 13–11, 11–8, 11–1తో చంద్రచూడ్‌ (జీఎస్‌ఎం)పై గెలుపొందాడు.

Advertisement
 
Advertisement
Advertisement