
‘రియో’ తర్వాత వీడ్కోలు!
వచ్చే ఏడాది జరగనున్న రియో ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ అన్నాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో
బీజింగ్: వచ్చే ఏడాది జరగనున్న రియో ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ అన్నాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ‘డబుల్’ సాధించాక రిటైర్మెంట్ అంశంపై కొంత స్పష్టతనిచ్చాడు. ‘రియో తర్వాత మరో ఏడాది కొనసాగాలని నా స్పాన్సర్లు కోరుతున్నారు. కానీ నా కోచ్ మాత్రం 2017 లండన్‌లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడం కష్టమేనని చెబుతున్నాడు. రియో తర్వాత నా శరీరం సహకరిస్తేనే లండన్‌లో బరిలోకి దిగుతా.
ఓవరాల్‌గా 50-50 చాన్స్ మాత్రమే ఉంది’ అని బోల్ట్ పేర్కొన్నాడు. మరోవైపు గురువారం 200 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించాక సంబరాలు చేసుకుంటున్న బోల్ట్‌ను ఎలక్ట్రిక్ స్కూటర్‌తో సీసీటీవీ కెమెరామన్ సాంగ్ తావో ఢీకొట్టిన వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది. టీవీ కెమెరామన్ మాత్రమే బోల్ట్‌ను పడగొట్టగలడని చైనీస్ నెటిజన్లు దీనిపై జోక్‌లు పేలుస్తున్నారు.
మరోవైపు శుక్రవారం 200 మీటర్ల విభాగం బహుమతి ప్రదానోత్సవం తర్వాత బోల్ట్‌ను కలిసిన సీసీటీవీ కెమెరామన్ సాంగ్ తావో జరిగిన ఘటనపై క్షమాపణ చెప్పాడు. ‘ముఖ్యమైన విషయమేమిటంటే బోల్ట్‌కు ఎలాంటి గాయం కాలేదు. నేను కూడా బాగానే ఉన్నాను. మళ్లీ నా విధులకు హాజరవుతున్నాను’ అని సాంగ్ తావో వ్యాఖ్యానించాడు