స్వర్ణంతో సీజన్‌కు ముగింపు | Usain Bolt closes out season with another win | Sakshi
Sakshi News home page

స్వర్ణంతో సీజన్‌కు ముగింపు

Sep 8 2013 2:17 AM | Updated on Sep 1 2017 10:32 PM

స్వర్ణంతో సీజన్‌కు ముగింపు

స్వర్ణంతో సీజన్‌కు ముగింపు

జమైకా మేటి అథ్లెట్ ఉసేన్ బోల్ట్... సీజన్ చివరిదైన డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్‌లోనూ సత్తా చాటాడు. శుక్రవారం జరిగిన 100 మీటర్ల రేసును 9.80 సెకన్లలో ముగించి స్వర్ణం గెలుచుకున్నాడు.

బ్రస్సెల్స్: జమైకా మేటి అథ్లెట్ ఉసేన్ బోల్ట్... సీజన్ చివరిదైన డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్‌లోనూ సత్తా చాటాడు. శుక్రవారం జరిగిన 100 మీటర్ల రేసును 9.80 సెకన్లలో ముగించి స్వర్ణం గెలుచుకున్నాడు.
 
  మైకేల్ రాడ్‌గెర్స్ (అమెరికా) 9.90 సెకన్లతో సీజన్ బెస్ట్‌ను నమోదు చేసి రజతం సాధించాడు. నెస్టా కార్టర్ (జమైకా), జస్టిన్ గాట్లిన్ (అమెరికా) 9.94 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కాంస్య పతకాలతో సంతృప్తిపడ్డారు. ‘ఈ సీజన్‌లో నాకు ఇది చివరి రేసు. నా టైమింగ్ సీజన్ బెస్ట్ (9.77 సెకన్లు)కు దగ్గరగా వచ్చింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది’ అని రేసు అనంతరం బోల్ట్ వ్యాఖ్యానించాడు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement