బాస్కెట్బాల్ లో తిరుగులేని అమెరికా | US win Basketball World Cup | Sakshi
Sakshi News home page

బాస్కెట్బాల్ లో తిరుగులేని అమెరికా

Sep 15 2014 8:32 AM | Updated on Apr 4 2019 3:25 PM

బాస్కెట్బాల్ లో తిరుగులేని అమెరికా - Sakshi

బాస్కెట్బాల్ లో తిరుగులేని అమెరికా

బాస్కెట్బాల్ లో తమకు ఎదురులేదని అమెరికా మరోసారి రుజువు చేసింది.

మాడ్రిడ్: బాస్కెట్బాల్ లో తమకు ఎదురులేదని అమెరికా మరోసారి రుజువు చేసింది. ప్రపంచకప్ టైటిల్ ను నిలబెట్టుకుని తమ హవా కొనసాగించింది. మాడ్రిడ్ పాలసియో డీ రిపోర్టిస్ లో ఆదివారం జరిగిన ఫైనల్లో సెర్బియాను 129-92 తేడాతో ఓడించి వరల్డ్ కప్ టైటిల్ కైవసం చేసుకుంది.

అయితే ప్రపంచ రికార్డు స్కోరుకు 8 పాయింట్ల దూరంలో నిలిచింది అమెరికా. 1994 నాటి ప్రపంచకప్ ఫైనల్లో 137 పాయింట్లు సాధించింది. తమ కంటే మెరుగ్గా రాణించిన అమెరికాకు ప్రపంచ కప్ టైటిల్ దక్కడం నూటికి నూరుపాళ్లు సమంజసమని సెర్బియా వ్యాఖ్యానించి క్రీడాస్ఫూర్తిని చాటుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement