యూఎస్ ఓపెన్ ఎరీనా ఇప్పుడు హాస్పిటల్!

న్యూయార్క్: ప్రతియేటా ఆఖరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు వేదికయ్యే యూఎస్ ఓపెన్ ఎరీనా ఇప్పుడు కరోనా ఆసుపత్రిగా మారనుంది. అమెరికాలో 2 లక్షలకు పైగానే కరోనా బారిన పడ్డారు. దీంతో న్యూయార్క్ సిటీలోని యూఎస్ ఓపెన్ స్టేడియం ఇండోర్ సౌకర్యాలను 350 పడకల హాస్పిటల్‌గా మార్చాలని అక్కడి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఆఫీస్ నిర్ణయించింది. లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియాన్ని పాకశాలగా మార్చనున్నారు. ఇందులో రోజూ డాక్టర్లు, ఇతర సహాయక సిబ్బందితో కలిపి మొత్తం 25 వేల మందికి భోజనాలు పెడతారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి