ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్‌లోకి మరో రెండు కొత్త జట్లు రాబోతున్నాయి.
చెన్నై: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్‌లోకి మరో రెండు కొత్త జట్లు రాబోతున్నాయి. డిసెంబర్ 22 నుంచి జనవరి 14 వరకు జరిగే పీబీఎల్–3లో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్, గువాహటి ఈస్టర్న్ వారియర్స్ ఆడనున్నాయి. దీంతో పీబీఎల్‌లో జట్ల సంఖ్య ఆరు నుంచి ఎనిమిదికి చేరింది.
‘బాయ్’ ఆధ్వర్యంలో ఈసారి నాలుగు నగరాల్లో మ్యాచ్‌లు జరుగనుండగా ఫైనల్‌కు చెన్నై వేదిక కానుంది. ఈ ఏడాది జనవరిలో ముగిసిన రెండో సీజన్‌ను పీవీ సింధు నేతృత్వంలోని చెన్నై స్మాషర్స్ జట్టు గెలుచుకుంది.