స్టీవ్ స్మిత్కు మళ్లీ ఏమైంది? | Twitter Trolls Steve Smith Over Second 'Brain Fade' | Sakshi
Sakshi News home page

స్టీవ్ స్మిత్కు మళ్లీ ఏమైంది?

Mar 21 2017 12:28 PM | Updated on Sep 5 2017 6:42 AM

స్టీవ్ స్మిత్కు మళ్లీ ఏమైంది?

స్టీవ్ స్మిత్కు మళ్లీ ఏమైంది?

ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ డ్రెస్సింగ్ రూమ్ వివాదం అతన్ని ఇప్పుడే విడిచిపెట్టేలా కనబడుటల్లేదు.

రాంచీ: ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ డ్రెస్సింగ్ రూమ్ వివాదం అతన్ని ఇప్పుడే విడిచిపెట్టేలా కనబడుటల్లేదు. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో డీఆర్ఎస్ నిర్ణయంపై డ్రెస్సింగ్ రూమ్ సహాయం కోరి అడ్డంగా దొరికిపోయిన స్మిత్ పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. రాంచీ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భాగంగా చివరిరోజు ఆటలో జడేజా బౌలింగ్ లో స్మిత్ బౌల్డ్ అయ్యాడు. జడేజా వేసిన ఒక పదునైన బంతిని బ్యాట్ తో అడ్డుకోకుండా అలానే చూస్తుండిపోయి స్మిత్ తన  వికెట్ ను సమర్పించుకున్నాడు.  దీనిపై బ్రెయిన్ ఫేడ్ ట్యాగ్తో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.


అటు మాజీ క్రికెటర్ల దగ్గర్నుంచి, ఇటు అభిమానులు సైతం ట్విట్టర్ వేదికగా స్మిత్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత్ తో సిరీస్ లో స్మిత్ కు అసలు ఏమైందంటూ ఛలోక్తులు విసురుతున్నారు. దీనిలో భాగంగా జడేజా బౌలింగ్ లో స్మిత్ బౌల్డ్ అయిన తీరు చూస్తుంటే మళ్లీ అతనికి బుర్ర పనిచేయలేనట్లు ఉందంటూ ఒకరు చమత్కరించగా, ఇక స్మిత్ కు విమాన టికెట్ తీసి స్వదేశానికి పంపడానికి క్రికెట్ ఆస్ట్రేలియా సాయం చేయాలంటూ మరొక అభిమాని చురకలంటించాడు. మరొకవైపు ఈ సిరీస్ లో కచ్చితమైన 'బ్రెయిన్ ఫేడ్' ఏదైనా ఉందంటే అది స్మిత్ అవుటేనని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement