ఆసీస్‌కు ఎదురుదెబ్బ

Turner called up as Mitchell Marsh cover in ODI squad - Sakshi

తొలి వన్డేకు మిచెల్‌ మార్ష్ దూరం

సిడ్నీ: భారత్‌తో జరుగనున్న మూడు వన్డేల సిరీస్‌లో తలపడే ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగలింది. శనివారం సిడ్నీ వేదికగా జరిగే తొలి వన్డేకు ఆల్‌ రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ దూరమయ్యాడు. జీర్ణాశయ సంబంధిత రోగంతో బాధపడుతున్న మార్ష్‌ కొన్ని రోజులుగా ఆస‍్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. దాంతో మిచెల్‌ మార్ష్‌ తొలి వన్డేలో పాల్గొనడం లేదని ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ తెలిపాడు. మిగతా రెండు వన్డేలకు మార్ష్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నాడు. మిచెల్‌ మార్ష్‌ తేరుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అతని స్థానంలో ఆస్టాన్‌ టర్నర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించాడు.

మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ అయిన టర్నర్‌.. పార్ట్‌టైమ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ కావడంతో అతన్ని ఎంపిక చేసినట్లు కోచ్‌ తెలిపాడు. మరొకవైపు ఆస్టన్‌ వికెట్ల మధ్య పరుగెత్తడంలో అథ్లెట్‌ను తలపిస్తాడన్నాడు. బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో ఆస్టన్‌ టర్నర్‌ పెర్త్‌ స‍్కార్చర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.  ఈ లీగ్‌లో ఆస్టన్‌ ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో (60 నాటౌట్‌, 47, 43 నాటౌట్‌) రాణించాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top