జపాన్ ఆతిథ్యమివ్వనున్న టోక్యో–2020 ఒలింపిక్స్ బడ్జెట్‌ను స్వల్పంగా తగ్గించారు.
టోక్యో: జపాన్ ఆతిథ్యమివ్వనున్న టోక్యో–2020 ఒలింపిక్స్ బడ్జెట్‌ను స్వల్పంగా తగ్గించారు. గత నెల 17.78 బిలియన్ డాలర్లు (రూ.లక్షా 20 వేల కోట్లు)గా ఉన్న ఈ బడ్జెట్ అంచనాను 17 బిలియన్ల (రూ. లక్షా 15 వేల కోట్లు)కు కుదించారు. బడ్జెట్‌ను ఇప్పటినుంచే నియంత్రిం చలేకపోతే 30 బిలియన్ల (రూ. 2 లక్షల కోట్లు)కు పెరిగిపోతుందని గత నెల ఆర్థికవేత్తలు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఆర్గనైజింగ్ కమిటీ అంచనా వ్యయాన్ని కాస్త తగ్గించింది. ప్రస్తుత మారక నిల్వల ప్రకారం రియో ఈవెంట్ కోసం 12 బిలియన్లు (రూ. 81, 600 కోట్లు) ఖర్చు చేస్తే, లండన్ ఒలింపిక్స్ కోసం 13.7 బిలియన్లు (రూ. 93 వేల కోట్లు) ఖర్చయింది.