నేనో పురుష వ్యభిచారిని! | Tino Best Reveals His and West Indies Teammates' Sexual Exploits | Sakshi
Sakshi News home page

నేనో పురుష వ్యభిచారిని!

Apr 22 2016 12:58 AM | Updated on Sep 3 2017 10:26 PM

నేనో పురుష వ్యభిచారిని!

నేనో పురుష వ్యభిచారిని!

అంతర్జాతీయ క్రికెటర్ల సరదాలు, కొండొకచో అమ్మాయిలతో పరిధి దాటి ‘సహవాసం’లాంటి వార్తలు తరచుగా వినిపిస్తూనే ....

600కు పైగా అమ్మాయిలతో గడిపా 
వెస్టిండీస్ మాజీ పేసర్ టినో బెస్ట్ సంచలన వ్యాఖ్యలు

 
35 ఏళ్ల టినో బెస్ట్ పదేళ్ల టెస్టు కెరీర్‌లో ప్రపంచంలోని ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. 25 టెస్టులు, 26 వన్డేల్లో కలిపి91 వికెట్లు పడగొట్టాడు. 2014 జనవరిలో అతను ఆఖరిఅంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2012లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి బెస్ట్ చేసిన 95 పరుగులు  అప్పట్లో రికార్డుగా నిలిచింది.
 
బార్బడోస్: అంతర్జాతీయ క్రికెటర్ల సరదాలు, కొండొకచో అమ్మాయిలతో పరిధి దాటి ‘సహవాసం’లాంటి వార్తలు తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి విషయాల్లో సాధారణంగా ఎవరూ బయట పడరు. ఖండించడమో లేదా మౌనంగా ఉండటమో చేస్తారు. వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ టినో బెస్ట్ మాత్రం తనను తాను పురుష వ్యభిచారిగా ప్రకటించుకున్నాడు. తన వ్యక్తిగత జీవితం, సెక్స్ అభిరుచుల గురించి బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇప్పటి వరకు వేర్వేరు దేశాలకు చెందిన కనీసం 650 మంది వరకు అమ్మాయిలతో శృంగారం జరిపినట్లు అతను చెప్పుకున్నాడు. టినో బెస్ట్ ఆటోబయోగ్రఫీ ‘మైండ్ ద విండోస్-మై స్టోరీ’ లో ఈ విషయాలు ఉన్నాయి. ‘నేను అమ్మాయిలను ఇష్టపడతా. వాళ్లు కూడా నన్ను ఇష్టపడతారు. తలపై జుట్టు లేని అందమైన వ్యక్తిగా నన్ను నేను భావిస్తా. ఆ మాటకొస్తే బ్లాక్ బ్రాడ్ పిట్‌గా నన్ను పిలవవచ్చు’ అని బెస్ట్ అభివర్ణించుకున్నాడు.


 జాబితా పెద్దదే...
తన తొలిప్రేమ మెలీసా ద్వారా అమ్మాయి కూడా పుట్టిందని, అయితే ఆ తర్వాత ఆమె తనను పట్టించుకోలేదని, ఆపై తాను ప్లేబాయ్‌లాగా మారిపోయానన్న బెస్ట్... క్రికెటర్‌గా ఎక్కడికి వెళ్లినా అమ్మాయిలతో మాటలు కలిపి ఎలాగైనా వారిని పడక గది వరకు కచ్చితంగా తీసుకుపోయేవాడినని చెప్పుకున్నాడు. 2005 ఆస్ట్రేలియా సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడకపోయినా, మూడు నెలల వ్యవధిలో కనీసం 40 మందిని హోటల్ గది వరకు తీసుకురావడం జట్టులో అందరికంటే తనదే రికార్డని బెస్ట్ వెల్లడించాడు! వీటి వల్ల తన ఆటపై ఎలాంటి ప్రభావం పడలేదని, ప్రాక్టీస్‌లో అందరికంటే ఎక్కువగా కష్టపడిన క్రికెటర్ తనేనని టినో వ్యాఖ్యానించాడు.

గేల్‌తో తనకు మంచి స్నేహం ఉన్నా... ఇలాంటి విషయాలకు అతను దూరమని, ఎక్కువగా తన వినోదంలో డ్వేన్ బ్రేవో భాగమని అతను చెప్పాడు. అయితే ఎన్ని రాసలీలలు సాగించినా, దేశానికి ఆడటమే గర్వకారణంగా భావిస్తానన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement