
లోథా కమిటీ ప్రతిపాదనల వల్లే...
బీసీసీఐ అధ్యక్ష పదవి క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదని, దీనిని తాను ఐసీసీ చైర్మన్ పదవి కోసం వదులుకోలేదని శశాంక్ మనోహర్ చెప్పారు.
బీసీసీఐ అధ్యక్ష పదవి క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదని, దీనిని తాను ఐసీసీ చైర్మన్ పదవి కోసం వదులుకోలేదని శశాంక్ మనోహర్ చెప్పారు. ‘నేను రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎక్కడైనా స్వతంత్రంగా పనిచేయడం నా అలవాటు. వేరే వాళ్ల జోక్యం, ప్రభావం నాపై ఉంటాయంటే అంగీకరించను. లోథా కమిటీ చేసిన ప్రతిపాదనల్లో క్రికెట్‌కు చెడు చేసేవి కూడా ఉన్నాయి. అధ్యక్ష స్థానంలో వాటిని నేను భరించలేను. అందుకే రాజీనామా చేశాను’ అని చెప్పారు.