ఈసారి స్వర్ణం సాధిస్తా బాక్సర్ మేరీ కోమ్ | this time i will gold medal says mary kom | Sakshi
Sakshi News home page

ఈసారి స్వర్ణం సాధిస్తా బాక్సర్ మేరీ కోమ్

Sep 14 2014 1:11 AM | Updated on Sep 2 2017 1:19 PM

ఈసారి స్వర్ణం సాధిస్తా బాక్సర్ మేరీ కోమ్

ఈసారి స్వర్ణం సాధిస్తా బాక్సర్ మేరీ కోమ్

న్యూఢిల్లీ: గత ఆసియా క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకున్న దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ ఈసారి మాత్రం స్వర్ణంపై గురి పెట్టింది. ‘ఇప్పటిదాకా మా సన్నాహాలు చాలా బాగున్నాయి.

న్యూఢిల్లీ: గత ఆసియా క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకున్న దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ ఈసారి మాత్రం స్వర్ణంపై గురి పెట్టింది. ‘ఇప్పటిదాకా మా సన్నాహాలు చాలా బాగున్నాయి. గేమ్స్‌లో బరిలోకి దిగేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాం. కచ్చితంగా నేను స్వర్ణం సాధించడంపైనే దృష్టి పెట్టాను. ఈసారి మాత్రం కాంస్యంతో సరిపెట్టుకోను’ అని ఐదుసార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచిన 31 ఏళ్ల మేరీ కోమ్ తెలిపింది. అలీపూర్‌లో యువ శిక్షణ కేంద్ర నిర్మాణానికి క్రీడా మంత్రి శంకుస్థాపన చేయగా ఈ కార్యక్రమంలో మేరీ కోమ్, విజేందర్ పాల్గొన్నారు. మహిళల ఆత్మరక్షణకు బాక్సింగ్ అనేది చక్కగా ఉపయోగపడుతుందని మేరీ కోమ్ పేర్కొంది. అలాగే యువ ఆటగాళ్లు మరింత మెరుగ్గా రాణించేందుకు ఇలాంటి శిక్షణ కేంద్రాలు ఉపయోగపడతాయని బాక్సర్ విజేందర్ అన్నాడు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement