కుర్రాళ్లూ.. శభాష్‌! | They are rivals, not enemies: Twitter comments on India-Pak semi final | Sakshi
Sakshi News home page

Jan 30 2018 10:35 AM | Updated on Jan 30 2018 10:40 AM

They are rivals, not enemies: Twitter comments on India-Pak semi final - Sakshi

భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో వెల్లివిరిసిన క్రీడాస్ఫూర్తి

క్రైస్ట్‌చర్చ్‌: అండర్‌–19 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ జట్ల జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో క్రీడాస్ఫూర్తి వెల్లివిరిసింది. మైదానంలో ఇరు దేశాల యువ ఆటగాళ్లు పరస్పరం సహకరించుకున్న తీరు క్రీడాభిమానులను ఆకట్టుకుంది. భారత బ్యాట్స్‌మన్‌ శుభ్‌మాన్‌ గిల్ సెంచరీకి చేరువైన సమయంలో అతడి షూ లేసు ఊడిపోవడంతో పాకిస్తాన్‌ ఫీల్డర్‌ కట్టాడు. అలాగే తమ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ షూ లేసు ఊడిపోయినప్పుడు భారత ఫీల్డర్‌ సహాయం చేశాడు. సెంచరీ పూర్తి చేసిన శుభ్‌మాన్‌ గిల్‌ దగ్గరకు వచ్చి పాకిస్తాన్‌ ఆటగాళ్లలో చాలా మంది అతడిని అభినందించారు.

కీలక మ్యాచ్‌లో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఇరు జట్ల ఆటగాళ్లు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి అభిమానుల మనసు గెలుచుకుంది. ఈ ఫొటోలను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ వేసి ప్రశంసలు కురిపించారు. మ్యాచ్‌ ఫలితం ఎలావున్న యువ ఆటగాళ్లు తమ ప్రవర్తనతో మంచి సందేశం ఇచ్చారని పేర్కొన్నారు. భారత్‌-పాక్‌ క్రికెటర్లు ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదంటూ కామెంట్లు పెట్టారు. మరోవైపు పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లిన యువ టీమిండియాపై సోషల్‌ మీడియాలో అభినందనల వర్షం కురుస్తోంది.

శుభ్‌మాన్‌ గిల్‌ను అభినందిస్తున్న పాకిస్తాన్‌ ఆటగాళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement