'విరాట్ హద్దులు విధించలేదు' | There are no boundaries with Virat Kohli, says Amit Mishra | Sakshi
Sakshi News home page

'విరాట్ హద్దులు విధించలేదు'

Jul 11 2016 6:11 PM | Updated on Sep 4 2017 4:37 AM

'విరాట్ హద్దులు విధించలేదు'

'విరాట్ హద్దులు విధించలేదు'

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వార్మప్ మ్యాచ్లో ఆకట్టుకున్న అమిత్ మిశ్రా.. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు.

బసెటెర్రె (సెయింట్ కిట్స్): వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వార్మప్ మ్యాచ్లో ఆకట్టుకున్న అమిత్ మిశ్రా.. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లి ఎప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఉంటూ, జట్టును ఉత్తేజ పరుస్తుంటాడని కొనియాడాడు. 'విరాట్ లోని సానుకూల ధోరణితో జట్టులో మంచి వాతావరణం నెలకొంది. అతను ఎప్పుడూ నాకు సహకారం అందిస్తూనే ఉంటాడు. నాకు ఎటువంటి హద్దులను విరాట్ విధించలేదు. ఏ సందర్భంలోనైనా అతనితో మాట్లాడాలిస్తే వస్తే నా అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెబుతా. నాకు విరాట్ చెప్పేది ఒకటే. నీకు వికెట్లు సాధించే సత్తా ఉంది. నువ్వు ఏ రకంగా అయితే వికెట్లు సాధిస్తావని అనుకుంటున్నావో అదే చేయి. నీ బలాన్ని నీవు నమ్ముకో. మిగతా విషయాలు ఏమీ పట్టించుకోవద్దు'  అని మద్దతిస్తుంటాడని మిశ్రా తెలిపాడు.

వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ లో మిశ్రా 27 ఓవర్లలో 67 పరుగులిచ్చి 4 వికెట్లతో రాణించాడు. మరోవైపు  భువనేశ్వర్ కుమార్, షమీ, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ దక్కింది.  ఈ మ్యాచ్ లో ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (50), శిఖర్ ధావన్ (51)కు తోడు రోహిత్ శర్మ (54 నాటౌట్; 8 ఫోర్లు; 1 సిక్స్) కూడా అర్ధ సెంచరీలతో ఆకట్టుకోవడంతో టెస్టు సిరీస్ కు ముందు టీమిండియాకు మంచి ప్రాక్టీస్ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement