విండీస్‌ జట్టులో రెండు మార్పులు | The three-match ODI series against India will be announced on Wednesday. | Sakshi
Sakshi News home page

విండీస్‌ జట్టులో రెండు మార్పులు

Jun 29 2017 12:36 AM | Updated on Sep 5 2017 2:42 PM

భారత్‌తో జరుగనున్న మిగతా మూడు వన్డేల్లో తలపడే విండీస్‌ జట్టును బుధవారం ప్రకటించారు. ఇద్దరు యువ క్రికెటర్లు విండీస్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

నార్త్‌ సౌండ్‌ (ఆంటిగ్వా): భారత్‌తో జరుగనున్న మిగతా మూడు వన్డేల్లో తలపడే విండీస్‌ జట్టును బుధవారం ప్రకటించారు. ఇద్దరు యువ క్రికెటర్లు విండీస్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. జొనాథన్‌ కార్టర్, విలియమ్స్‌ స్థానంలో కైల్‌ హోప్, సునీల్‌ ఆంబ్రిస్‌లకు సెలక్టర్లు చోటు కల్పించారు. వీరిద్దరూ భారత్‌తో శుక్రవారం జరిగే మూడో వన్డేలో అరంగేట్రం చేయనున్నారు. ప్రస్తుత విండీస్‌ జట్టు వికెట్‌ కీపర్‌ షై హోప్‌ సోదరుడైన కైల్‌ హోప్‌ దేశవాళీల్లో ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో జట్టు తరఫున ఆడగా... సునీల్‌ ఆంబ్రిస్‌ విండ్‌వర్డ్‌ ఐలాండ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం భారత్‌ 1–0తో ఆధిక్యంలో ఉంది.  తొలి వన్డే వర్షం వల్ల రద్దు కాగా, రెండో వన్డేలో భారత్‌ 105 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement