క్రికెట్ దిగ్గజం సచిన్ జట్టు తమిళ్ తలైవాస్ మళ్లీ ఓడింది.
నాగ్‌పూర్: క్రికెట్ దిగ్గజం సచిన్ జట్టు తమిళ్ తలైవాస్ మళ్లీ ఓడింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో శుక్రవారం నాగ్‌పూర్ అంచె పోటీలు ప్రారంభం కాగా... జోన్–బిలో జరిగిన తొలి మ్యాచ్‌లో తలైవాస్ 31–32 స్కోరుతో బెంగళూరు బుల్స్ చేతిలో ఒక పాయింట్ తేడాతో పరాజయం చవిచూసింది. హైదరాబాద్‌లోనూ ఓడిన తమిళ జట్టుకు వరుసగా ఇది రెండో ఓటమి.
అనంతరం జరిగిన జోన్ ‘ఎ’ మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 26–21 స్కోరుతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో దబంగ్ ఢిల్లీ... బెంగళూరు బుల్స్‌తో యూపీ యోధ తలపడతాయి. ఈ పోటీలను ‘స్టార్ స్పోర్ట్స్–2’ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.