భువన, సౌజన్య శుభారంభం | The International Tennis Federation Women's Futures tournament | Sakshi
Sakshi News home page

భువన, సౌజన్య శుభారంభం

Feb 28 2017 12:13 AM | Updated on Sep 5 2017 4:46 AM

భువన, సౌజన్య శుభారంభం

భువన, సౌజన్య శుభారంభం

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల ఫ్యూచర్స్‌ టోర్నమెంట్‌లో ...

ఐటీఎఫ్‌ ఫ్యూచర్స్‌ టోర్నీ  

గ్వాలియర్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల ఫ్యూచర్స్‌ టోర్నమెంట్‌లో తెలుగు అమ్మా యిలు భువన కాల్వ, సౌజన్య భవిశెట్టి శుభారంభం చేశారు. ఇక్కడి సిటీ సెంటర్‌ టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో సోమవారం జరిగిన తొలి రౌండ్లో భువన 7–5, 6–4తో అలెగ్జాండ్ర వాల్టర్స్‌ (ఆస్ట్రేలియా)పై గెలుపొందగా, మూడో సీడ్‌ సౌజన్య 6–1, 6–1తో భారత్‌కే చెందిన యువరాణి బెనర్జీపై అలవోక విజయం సాధించింది. శివిక బర్మన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడో సీడ్‌ శ్రీవైష్ణవి పెద్దిరెడ్డి 4–1తో ఆధిక్యంలో ఉండగా ప్రత్యర్థి రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరిగింది.

దీంతో శ్రీవైష్ణవి ముందంజ వేసింది. డబుల్స్‌ విభాగంలో నిధి చిలుముల–ప్రేరణ బాంబ్రి జోడి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో ఈ జోడి 6–0, 6–2తో హర్షిత–హిమాని మోర్‌ జంటపై విజయం సాధించింది. గువాహటిలో జరుగుతున్న ఐటీఎఫ్‌ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్‌ చంద్రశేఖర్‌–విఘ్నేశ్‌ పెరణమల్లూర్‌ జంట 3–6, 6–3, 5–10తో మాటెస్జ్‌ టెర్జిన్‌స్కీ (పోలండ్‌)– జోస్‌కో విడలజారిన్‌ (స్పెయిన్‌) ద్వయం చేతిలో పరాజయం చవిచూసింది.

Advertisement
 
Advertisement
Advertisement