తలైవాస్‌కు తొలి విజయం | The first success of the Pink Panthers and Tamil Talevas in the pro Kabaddi League | Sakshi
Sakshi News home page

తలైవాస్‌కు తొలి విజయం

Aug 11 2017 3:20 AM | Updated on Sep 17 2017 5:23 PM

తలైవాస్‌కు తొలి విజయం

తలైవాస్‌కు తొలి విజయం

ప్రొ కబడ్డీ లీగ్‌లో సచిన్‌ జట్టు తమిళ్‌ తలైవాస్‌కు మొదటి విజయం దక్కింది.

నాగపూర్‌:   ప్రొ కబడ్డీ లీగ్‌లో సచిన్‌ జట్టు తమిళ్‌ తలైవాస్‌కు మొదటి విజయం దక్కింది. బెంగళూరు బుల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో తలైవాస్‌ 29–24తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన అనంతరం తమిళ్‌ జట్టు గెలుపు బోణీ చేయడం విశేషం. తలైవాస్‌ తరఫున కె. ప్రపంజన్‌ (6), అమిత్‌ హుడా (4) ఆకట్టుకున్నారు. బుల్స్‌ జట్టులో రోహిత్‌ కుమార్‌ (12) ఒంటరి పోరాటం చేశాడు.

పింక్‌ పాంథర్స్‌ కూడా...
ఐదో సీజన్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ జట్టు తొలి విజయాన్ని సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 30–28తో పుణేరి పల్టన్‌ను ఓడించింది. పుణేరి జట్టులో రైడర్‌ సందీప్‌ నర్వాల్‌ అత్యధికంగా 9 పాయింట్లు స్కోర్‌ చేశాడు. రోహిత్‌ చౌదరి 4 పాయింట్లు సాధించాడు. జైపూర్‌ జట్టు తరఫున మంజీత్‌ ఛిల్లర్‌ 9, జస్వీర్‌ సింగ్‌ 5 పాయింట్లు స్కోర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement