
రియో పారాలింపిక్స్ చాంపియన్ తంగవేలు మరియప్పన్ పారా ఆసియా క్రీడల్లో భారత పతాకధారిగా జట్టును నడిపించనున్నాడు. ఇండోనేసియాలోని జకార్తాలో ఈ నెల 6 నుంచి 13 వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. ఈసారి పారా క్రీడల్లో ఎన్నడూ లేని విధంగా భారత్ జంబో బృందంతో బరిలోకి దిగుతోంది. అథ్లెట్లు, సహాయ సిబ్బంది సహా మొత్తం 302 మందితో కూడిన భారత బృందం పతకాల వేటకు సిద్ధమైంది.
తొలి విడతగా వెళ్లిన కొంత మంది భారత జట్టు సభ్యులకు సోమవారం క్రీడాగ్రామం వద్ద చేదు అనుభవం ఎదురైంది. బస ఏర్పాట్లకు నిర్దేశిత ఫీజు రూ. కోటి 80 లక్షలు చెల్లించకపోవడంతో అథ్లెట్లను గేమ్స్ విలేజ్‌లోకి అనుమతించలేదు. చివరకు 4వ తేదీకల్లా చెల్లిస్తామన్న హామీతో నిర్వాహకులు ఆలస్యంగానైనా అనుమతించారు.