
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి సామ సాత్విక మహిళల డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన ఫైనల్లో సాత్విక–మహక్ జైన్ జంట 6–3, 6–3తో షేక్ హుమేరా (తెలంగాణ)–సారా దేవ్ జోడీపై గెలుపొందింది.
అండర్–18 బాలికల సింగిల్స్ టైటిల్ తెలంగాణ అమ్మాయికి ఖాయమైంది. ఈ విభాగంలో హైదరాబాద్ అమ్మాయిలు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక, షేక్ హుమేరా టైటిల్ పోరుకు చేరుకున్నారు. సెమీఫైనల్స్‌లో రష్మిక 6–4, 6–3తో రెండోసీడ్ శరణ్య గవారే (మహారాష్ట్ర)పై, షేక్ హుమేరా 6