తెలుగు టైటాన్స్ నాకౌట్ ‘కూత’ | telugu titans at pro kabaddi league semi finals | Sakshi
Sakshi News home page

తెలుగు టైటాన్స్ నాకౌట్ ‘కూత’

Jul 29 2016 8:52 AM | Updated on Sep 4 2017 6:57 AM

తెలుగు టైటాన్స్ నాకౌట్ ‘కూత’

తెలుగు టైటాన్స్ నాకౌట్ ‘కూత’

నగరంలో మరోసారి కబడ్డీ సందడి మొదలైంది. ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్‌లో సెమీఫైనల్ మ్యాచ్‌లు నేడు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి.

హైదరాబాద్: నగరంలో మరోసారి కబడ్డీ సందడి మొదలైంది. ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్‌లో సెమీఫైనల్ మ్యాచ్‌లు నేడు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. తెలుగు టైటాన్స్ నాకౌట్ బరిలో ఉండటంతో నగర అభిమానులు ఈ మ్యాచ్‌లపై విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. సీజన్ అసాంతం నిలకడగా రాణించిన పట్నా పైరేట్స్ శుక్రవారం జరిగే తొలి సెమీస్‌లో పుణెరి పల్టన్‌తో పోటీపడనుంది. రెండో సెమీస్‌లో తెలుగు టైటాన్స్... జైపూర్ పింక్‌పాంథర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

అభిమానుల ఆగ్రహం
గచ్చిబౌలి : సెమీఫైనల్ మ్యాచుల్ని ప్రత్యక్షంగా తిలకించాలనుకున్న హైదరాబాదీ అభిమానులకు నిర్వాహకుల నుంచి నిరాశ ఎదురైంది. పరిమిత సంఖ్యలో ఉన్న టికెట్లను ఇదివరకే ఆన్‌లైన్‌లో విక్రయించిన నిర్వాహకులు స్టేడియం ముందు ఏర్పాటు చేసిన కౌంటర్‌లో మొక్కుబడిగా కేవలం పదుల సంఖ్యలో అందుబాటులో ఉంచారు. దీంతో టికెట్ల కోసం గురువారం క్యూలైన్‌లో బారులు తిరిన అభిమానులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు టికెట్లు ఇవ్వాలని నిలదీశారు. కౌంటర్లో ఇస్తామన్న 175 టికెట్లలో కేవలం 80 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని వారితో వాగ్వాదానికి దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement