తెలంగాణ జట్ల శుభారంభం | Telangana Teams won softball Championship Opener | Sakshi
Sakshi News home page

తెలంగాణ జట్ల శుభారంభం

Nov 17 2018 10:29 AM | Updated on Nov 17 2018 10:29 AM

Telangana Teams won softball Championship Opener - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సౌత్‌జోన్‌ సీనియర్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. గోవాలో శుక్రవారం ప్రారంభమైన ఈ టోర్నీ పురుషుల తొలి మ్యాచ్‌లో తెలంగాణ 10–1తో పాండిచ్చేరిపై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో గోవా 10–0తో తమిళనాడును ఓడించగా, ఆంధ్రప్రదేశ్‌ 2–0తో పాండిచ్చేరిపై గెలిచింది. మహిళల విభాగంలో తెలంగాణ 10–0తో పాండిచ్చేరిపై, ఆంధ్రప్రదేశ్‌ 8–0తో గోవాపై నెగ్గాయి.

ఇతర మ్యాచ్‌ల్లో కర్ణాటక 10–0తో పాండిచ్చేరిపై, కేరళ 10–0తో కర్ణాటకపై, గోవా 10–0తో తమిళనాడుపై విజయం సాధించాయి. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే చంద్రాకమ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత సాఫ్ట్‌బాల్‌ సమాఖ్య సీఈవో ప్రవీణ్, ఉపాధ్యక్షులు ధర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement