బాస్కెట్‌బాల్‌ టోర్నీ లో తెలంగాణ శుభారంభం | telangana beats puducherry in basket ball championship | Sakshi
Sakshi News home page

బాస్కెట్‌బాల్‌ టోర్నీ లో తెలంగాణ శుభారంభం

Jul 3 2017 10:41 AM | Updated on Sep 5 2017 3:06 PM

జాతీయ యూత్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తెలంగాణ జట్టు శుభారంభం చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ యూత్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో బాలుర విభాగంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 59–10తో పుదుచ్చేరిని చిత్తుగా ఓడించింది. తెలంగాణ తరఫున వినయ్‌ కొఠారి, విఘ్నేశ్వర్‌ చెరో 11 పాయింట్లతో చెలరేగగా... సుమంత్‌ మరిన్ని 10 పాయింట్లు స్కోర్‌ చేశాడు. మరోవైపు బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు 35–14తో అస్సాంపై గెలుపొందింది. ఏపీ జట్టులో సత్యసాయి 21 పాయింట్లు సాధించి ఆకట్టుకుంది. బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు 73–16తో గోవాపై విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌ జట్టులో వీఎన్‌ దుర్గా ప్రసాద్‌ (22), మణికంఠ (17), పవన్‌ కుమార్‌ (10) సత్తాచాటారు.  

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

బాలికలు: కేరళ 69–48తో ఉత్తరప్రదేశ్‌పై, హరియాణా 36–15తో గోవాపై, పశ్చిమ బెంగాల్‌ 61–50తో చండీగఢ్‌పై, ఉత్తరాఖండ్‌ 22–8తో జమ్మూ, కశ్మీర్‌పై, ఢిల్లీ 43–2తో బిహార్‌పై, ఒడిశా 39–21తో పుదుచ్చేరిపై గెలుపొందాయి.
బాలురు: మహారాష్ట్ర 69–67తో తమిళనాడుపై, గుజరాత్‌ 62–37తో ఉత్తరాఖండ్‌పై, బిహార్‌ 57–34తో జార్ఖండ్‌పై విజయం సాధించాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement