టీమిండియా నంబర్ వన్ | Team India get top rank in ICC Test Rankings | Sakshi
Sakshi News home page

టీమిండియా నంబర్ వన్

Aug 17 2016 2:56 PM | Updated on Sep 4 2017 9:41 AM

టీమిండియా నంబర్ వన్

టీమిండియా నంబర్ వన్

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా మొదటి స్థానానికి చేరుకుంది.

దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా మొదటి స్థానానికి చేరుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో కోహ్లి సేన టాప్ ర్యాంకులో నిలిచింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోవడంతో టీమిండియా మొదటి ర్యాంకు సొంతం చేసుకుంది. 3-0తో సిరీస్ ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేయడంతో మొదటి ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా మూడో స్థానానికి పడిపోయింది.

ఇంగ్లండ్తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను 2-2తో డ్రాగా ముగిసించిన పాకిస్థాన్ రెండో ర్యాంకులో నిలిచింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్.. 4,5 స్థానాలు దక్కించుకున్నాయి. శ్రీలంక(6), దక్షిణాఫ్రికా(7), వెస్టిండీస్(8), బంగ్లాదేశ్(9), జింబాబ్వే(10) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement