సర్ఫరాజ్‌కు టీమిండియా ఫ్యాన్స్‌ మద్దతు | Team India Fans Defend Sarfaraz After He Gets Body Shamed Again | Sakshi
Sakshi News home page

పాక్‌ సారథికి టీమిండియా ఫ్యాన్స్‌ సపోర్ట్‌

Jun 22 2019 5:09 PM | Updated on Jun 22 2019 5:09 PM

Team India Fans Defend Sarfaraz After He Gets Body Shamed Again - Sakshi

వెదవల జోలికి పోవడం కన్నా ప్రశాంతంగా ఉండటమే మంచిదని వాళ్లమ్మ సర్ఫరాజ్‌కు నేర్పించింది

లండన్‌: పాకిస్తాన్‌ సారథి సర్ఫరాజ్‌ అహ్మద్‌కు టీమిండియా అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంగ్లండ్‌లో షాపింగ్‌ చేస్తున్న సర్ఫరాజ్‌ను ఓ అభిమాని తీవ్రంగా అవమానానికి గురిచేశాడు. షాపింగ్‌ చేస్తున్న సర్ఫరాజ్‌ను ఓ అభిమాని సెల్ఫీ అడగగా అతడు అంగీకరించాడు. అంతలోనే సర్ఫరాజ్‌ కొడుకు ఏడుస్తుండటంతో పక్కకు జరిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ అభిమాని.. ‘సర్ఫరాజ్‌ బాయ్‌.. ఎందుకిలా పందిలా బలిసావు. కొంచెం డైట్‌ చేయవచ్చు కదా’  అంటూ అభ్యంతరకర పదజాలం వాడాడు. అయినా సర్ఫరాజ్‌ ఏ మాత్రం ఆగ్రహానికి గురవ్వకుండా ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అయితే ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేయడంతో సర్ఫరాజ్‌కు మద్దతుగా టీమిండియా అభిమానులతో సహా యావత్‌ క్రికెట్‌ ప్రపంచం అండగా నిలిచింది. అభ్యంతరకర పదజాలంతో నోరుపారేసుకున్న సదరు వ్యక్తిపై సోషల్‌ మీడియా వేదికగా మండిపడ్డారు. సర్ఫరాజ్‌తో అభిమాని ప్రవర్తించిన తీరు సిగ్గుచేటన్నారు. విజయం సాధించినప్పుడు భుజానికి ఎత్తుకోవడం, ఓడిపోయినప్పుడు కాళ్లతో తొక్కేయడం సబబు కాదని పేర్కొన్నారు. ‘నీలాంటి వెదవల జోలికి పోవడం కన్నా ప్రశాంతంగా ఉండటమే మంచిదని వాళ్లమ్మ సర్ఫరాజ్‌కు నేర్పించింది’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఒక ఆటగాడిపై వ్యక్తిగతంగా మాటలదాడి చేయడం, అతని శరీర ఆకృతిని ప్రస్తావిస్తూ తిట్టడం సరైంది కాదని క్రికెట్‌ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఇక సోషల్‌మీడియా ప్రభావంతో తన తప్పును తెలుసుకొని ఆ అభిమాని సర్ఫరాజ్‌కు క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన పని పట్ల పశ్చాతాపం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. పాక్‌ కెప్టెన్‌ పట్ల నేను ప్రవర్తించిన తీరుకు పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటనతో బాధపడ్డ ప్రతి ఒక్కరికి బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాను. నేను అసలు ఆ వీడియోనే అప్‌లోడ్‌ చేయలేదు. అది ఎలా వైరల్‌ అయ్యిందో నాకు తెలియదు. కానీ నేను చేసింది చాలా తప్పు. సర్ఫరాజ్‌తో ఉన్న చిన్నారి తన కొడుకని నాకు తెలియదు.’ అంటూ క్షమాపణలు కోరాడు.

చదవండి:
సర్ఫరాజ్‌ను సెల్ఫీ అడిగి మరి తిట్టాడు!
‘గెలుపైనా, ఓటమైనా అందరిదీ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement