బంగ్లాదేశ్‌ విజయం | Tamim Iqbal hits ton as Bangladesh thrash Sri Lanka in first ODI | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ విజయం

Mar 26 2017 1:33 AM | Updated on Sep 5 2017 7:04 AM

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్‌ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (127; 15 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించడంతో మొదట బ్యాటింగ్‌ చేపట్టిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది.

దంబుల్లా: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్‌ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (127; 15 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించడంతో మొదట బ్యాటింగ్‌ చేపట్టిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. షకీబుల్‌ హసన్‌ (72; 4 ఫోర్లు, 1 సిక్స్‌), షబ్బీర్‌ రహమాన్‌ (54; 10 ఫోర్లు) రాణించారు. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 45.1 ఓవర్లలో 234 పరుగుల వద్ద ఆలౌటైంది. మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఈనెల 28న జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement