అర్పీందర్‌ అద్భుతం 

Swapna Barman and Arpinder Singh continue India's athletics gold rush - Sakshi

48 ఏళ్ల తర్వాత ట్రిపుల్‌ జంప్‌లో భారత్‌కు స్వర్ణం 

జకార్తా: ఆసియా క్రీడల్లో పురుషుల ట్రిపుల్‌ జంప్‌ స్వర్ణం కోసం సుదీర్ఘంగా సాగుతున్న భారత నిరీక్షణకు అర్పీందర్‌ సింగ్‌ తెరదించాడు. అద్భుత ప్రదర్శనతో ఈ క్రీడాంశంలో అతడు 48 ఏళ్ల అనంతరం బంగారు పతకం అందించాడు. బుధవారం జరిగిన పోటీల్లో మూడో ప్రయత్నంలో 16.77 మీటర్లు దూకిన అర్పీందర్‌ టాప్‌లో నిలిచాడు. తొలి యత్నంలో విఫలమైనప్పటికీ... రెండో సారి అతడు 16.58 మీటర్లు జంప్‌ చేశాడు. మూడోసారి ఈ పంజాబ్‌ అథ్లెట్‌ దానిని మరింత మెరుగుపర్చుకున్నాడు.

ఉజ్బెకిస్తాన్‌కు చెందిన రుస్లాన్‌ కుర్బనోవ్‌ (16.62 మీ.) రజతం, షువో కావ్‌ (16.56 మీ.) కాంస్యం అందుకున్నారు. మరోవైపు 2014 కామన్వెల్త్‌ క్రీడల కాంస్యం తర్వాత అర్పీందర్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. అతడి వ్యక్తిగత ఉత్తమ రికార్డు మాత్రం 17.17 మీటర్లు కావడం గమనార్హం. ట్రిపుల్‌ జంప్‌లో 1970 ఏషియాడ్‌లో మొహిందర్‌ సింగ్‌ గిల్‌ (16.11 మీ.) స్వర్ణం నెగ్గిన తర్వాత భారత్‌కు మరో స్వర్ణం రావడం ఇదే మొదటిసారి.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top