అవన్నీ తప్పుడు వార్తలు : రైనా

Suresh Raina Fires on Fake Youtube Channels - Sakshi

న్యూఢిల్లీ : తప్పుడు వార్తలు సృష్టించే యూట్యూబ్‌ ఛానెళ్లకు అడ్డు అదుపులేకుండా పోయింది. హిట్స్‌ కోసం ఎంతటికైనా తెగిస్తూ.. తప్పుడు వార్తలతో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తరహా అసత్య వార్తలకు టీమిండియా క్రికెటర్‌ సురేశ్‌ రైనా సైతం బలయ్యాడు. అతని కారు ప్రమాదానికి గురై, తీవ్రంగా గాయపడ్డాడని ఓ వార్తను సృష్టించారు ఫేక్‌ యూట్యూబర్స్‌. కొందరైతే ఏకంగా తను ఆ ప్రమాదంలో మరణించారని కూడా రాసేశారు. ఈ వార్తలపై సురేశ్‌ రైనా ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

‘గత రెండు, మూడు రోజులుగా నేను రోడ్డు ప్రమాదానికి గురైనట్లు ఓ ఫేక్‌ వార్త వైరల్‌ అవుతోంది. ఇది నన్ను, నా కుటుంబాన్ని, స్నేహితులను, శ్రేయోభిలాషులను తీవ్రంగా కలిచి వేసింది. దయచేసి ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారం చేయవద్దు. ఆ దేవుడి దయవల్ల నేను క్షేమంగానే ఉన్నాను. ఈ తరహా వార్తలను ప్రచారం చేసిన సదరు యూట్యూబ్‌ చానెళ్లపై ఇప్పటికే ఫిర్యాదు చేశాను. వాటిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.’ అని తన ఆవేదనను వ్యక్తం చేశాడు. గతంలో కూడా అనేకమంది పెద్ద సెలబ్రిటీలు తప్పుడు వార్తలతో ఇబ్బందుల పాలైన విషయం తెలిసిందే. ఈ తరహా నకిలీ వార్తలపై అభిప్రాయాన్ని పంచుకున్నా.. షేర్‌ చేసినా చిక్కుల్లో పడుతారు తస్మాత్‌ జాగ్రత్త!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top