సుదర్శన్‌కు మూడు పతకాలు | Sakshi
Sakshi News home page

సుదర్శన్‌కు మూడు పతకాలు

Published Fri, Nov 4 2016 11:13 AM

sudarshan gets three medals in world masters championship

వరల్డ్ మాస్టర్స్  అథ్లెటిక్ చాంపియన్‌షిప్
 
 సాక్షి, హైదరాబాద్: వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ పి. సుదర్శన్ మెరిశాడు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జరుగుతోన్న పోటీల్లో ఈ 93 ఏళ్ల క్రీడాకారుడు... మూడు పతకాలను కై వసం చేసుకున్నాడు. భారత్ తరఫున 90-95 వయోవిభాగంలో తలపడిన సుదర్శన్ షాట్‌పుట్ విభాగంలో పసిడి పతకాన్ని సాధించగా... జావెలిన్ త్రో, డిస్కస్ త్రో విభాగాల్లో రజత పతకాలను గెలుపొందాడు. మొత్తం ఈ చాంపియన్‌షిప్‌లో 92 దేశాలకు చెందిన 4000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.                               

 

Advertisement
 
Advertisement