విమాన ప్రమాదానికి గురైన జట్టుకే టైటిల్ | Sudamericana title given to plane crash team | Sakshi
Sakshi News home page

విమాన ప్రమాదానికి గురైన జట్టుకే టైటిల్

Dec 6 2016 3:04 PM | Updated on Oct 2 2018 8:39 PM

చాపీకోయెన్స్ (ఫైల్ ఫొటో) - Sakshi

చాపీకోయెన్స్ (ఫైల్ ఫొటో)

ఇటీవల కొలంబియాలో విమాన ప్రమాదానికి గురైన బ్రెజిల్ క్లబ్ ఫుట్ బాల్ జట్టుకే కోపా సుడా మెరికన్ టైటిల్ అప్పగించేందుకు దక్షిణ అమెరికా ఫుట్బాల్ సమాఖ్య అంగీకరించింది.

ఆసిన్సియన్: ఇటీవల కొలంబియాలో విమాన ప్రమాదానికి గురైన బ్రెజిల్ ఫుట్ బాల్ క్లబ్ జట్టుకు కోపా సుడామెరికన్ టైటిల్ అప్పగించేందుకు దక్షిణ అమెరికా ఫుట్బాల్ సమాఖ్య అంగీకరించింది. దాంతో పాటు ఆ జట్టుకు రెండు మిలియన్లు యూఎస్ డాలర్ల  ప్రైజ్ మనీని కూడా ఇవ్వనున్నారు. ప్రత్యర్థి జట్టు అట్లెటికో విజ్ఞప్తి మేరకు ఆ టైటిల్ను వారికి ఇవ్వడానికి అంగీకరించిన విషయాన్ని దక్షిణ అమెరికా ఫుట్ బాల్ సమాఖ్య తాజాగా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించిన దక్షిణా అమెరికా ఫుట్ బాల్ సమాఖ్య.. ఈ లీగ్ ఫెయిర్ ప్లే అవార్డును అట్లాటికో జట్టుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది.


గత కొన్నిరోజుల క్రితం బ్రెజిల్ కు చెందిన చాపీకోయెన్స్ జట్టు ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలి  పలువురు ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టు మెడిల్లిన్ లో జరిగే తొలి అంచె ఫైనల్కు వెళుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. తొలి ఫైనల్లో కొలంబియన్ క్లబ్ జట్టు అట్లెటికో జట్టుతో చాపీకోయెన్స్ ఆడాల్సి ఉంది.


ఈ ప్రమాదంలో దాదాపు 71 మంది ప్రయాణికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. ఇందులో  19 ఫుట్ బాల్ ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోగా, అతికొద్ది మంది మాత్రమే గాయాలతో బయటపడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement