సిక్స్‌ సిక్సెస్‌ బాధిత బౌలర్‌ ఏమన్నాడంటే

Stuart Broad Wishing Yuvraj Singh on His Retirement - Sakshi

హైదరాబాద్‌ : మైదానంలో మహరాజు టీమిండియా యువరాజ్‌ సింగ్‌ అంటే క్రికెట్‌ ప్రపంచానికి గుర్తుకొచ్చేది సిక్స్‌ సిక్సెస్‌. సోమవారం ఈ సిక్సర్ల కింగ్‌ తన ఆటకు గుడ్‌బై చెప్పడంతో అతని అభిమానులు ఆటగాళ్లు ఆ మహాద్భుత ఘట్టాన్ని నెమరువేసుకుంటున్నారు. ‘భారత క్రికెట్‌లో నీది చెరపలేని చరిత్ర.. మరవలేని యాత్ర.. మరెవరిని ఊహించలేని పాత్ర’ అంటూ ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. ఈ క్రమంలోనే యువరాజ్‌ బ్యాట్‌కు బలైన ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ యువీ రిటైర్మెంట్‌పై స్పందించాడు. ‘ ఓ దిగ్గజం నీ రిటైర్మెంట్‌ను ఆస్వాదించు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. (చదవండి: మైదానంలో ‘మహరాజు’)

6 6 6 6 6 6  
2007 తొలి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన పోరులో యువరాజ్‌ చూపించిన విశ్వరూపం ఇది. స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన యువీ కొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో 12 బంతుల్లోనే అతను చేసిన ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. బహుషా ఈ రికార్డును ఎవరూ అందుకోలేరేమో. ఆ మ్యాచ్‌లో అప్పటి ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ వాగ్వాదానికి దిగడంతో అతిని పై యువీకి ఉన్న ఆగ్రహానికి బ్రాడ్‌ బలయ్యాడు. యువీ బాదుడుకు బ్రాడ్‌ ఏడ్చేశాడు. యువీ సృష్టించిన ఆ విధ్వంసం మరోసారి మీ కోసం...(చదవండి : యువరాజ్‌ గుడ్‌బై)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top