రెండో వన్డేలో సరదా సన్నివేశం | A stretcher for a scratch | Sakshi
Sakshi News home page

Feb 4 2018 4:08 PM | Updated on Feb 4 2018 4:08 PM

A stretcher for a scratch - Sakshi

నవ్వుతూ.. స్ట్రెచర్‌ వద్దని సైగ చేస్తున్న బుమ్రా

సెంచూరియన్‌ : భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. తొలుత దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ చేయగా పాండ్యా వేసిన 18.3 ఓవర్‌లో డుమిన్‌ బౌండరీ బాదాడు. ఈ బౌండరీని ఆపే ప్రయత్నంలో బుమ్రా చిన్నగా గాయపడ్డాడు.

అయితే గాయం మోకాలికి కావడంతో నడవడం కష్టం అనుకున్న మైదాన సిబ్బంది ఏకంగా స్ట్రెచర్‌ తీసుకొని రా సాగారు. దీన్ని గమనించిన బుమ్రా నవ్వుతూ..వద్దని సైగ చేశాడు. ‘చిన్న గాయానికి స్ట్రెచర్‌ ఏంటి రా నాయనా అని’ ఫీలయినట్లున్నాడు బుమ్రా..  పక్కనే ఉన్న భారత ఫిజియో ముఖంలో సైతం నవ్వులు పూసాయి. ఇక భారత బౌలర్ల దాటికి ఆతిథ్య జట్టు 118 పరుగులకే కుప్ప కూలింది.

Advertisement
 
Advertisement
Advertisement