టైటిల్‌ పోరుకు శ్రీవల్లి రష్మిక | srivalli ready to title fight in ITF junior tourney | Sakshi
Sakshi News home page

టైటిల్‌ పోరుకు శ్రీవల్లి రష్మిక

Jul 22 2017 10:27 AM | Updated on Sep 5 2017 4:38 PM

టైటిల్‌ పోరుకు శ్రీవల్లి రష్మిక

టైటిల్‌ పోరుకు శ్రీవల్లి రష్మిక

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) గ్రేడ్‌–5 జూనియర్‌ టోర్నమెంట్‌లో తెలుగు అమ్మాయి శ్రీవల్లి రష్మిక టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది.

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) గ్రేడ్‌–5 జూనియర్‌ టోర్నమెంట్‌లో తెలుగు అమ్మాయి శ్రీవల్లి రష్మిక టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. వియత్నాంలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్‌ సెమీఫైనల్లో రెండో సీడ్‌ రష్మిక (భారత్‌) 6–1, 4–6, 6–4తో ఏడో సీడ్‌ పీ యు లై (చైనీస్‌ తైపీ)పై గెలుపొందింది.

మరోవైపు డబుల్స్‌ విభాగంలో శ్రావ్య శివాని జోడీకి నిరాశ ఎదురైంది. మహిళల డబుల్స్‌ సెమీ ఫైనల్లో శ్రావ్య శివాని (భారత్‌)–రఫెలా జీన్‌ (ఫిలిప్పీన్స్‌) జంట 2–6, 2–6తో యుజియావో– చున్‌జి గుయో (చైనీస్‌ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే మహిళల సింగిల్స్‌ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక, టాప్‌సీడ్‌ యుజియావో (చైనీస్‌ తైపీ)తో తలపడుతుంది.  

 

Advertisement
 
Advertisement
Advertisement