క్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక | Srivalli Rashmika enters quarters of Jr Grade 4 ITF Tourney | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక

Oct 26 2017 10:51 AM | Updated on Oct 26 2017 10:51 AM

Srivalli Rashmika enters quarters of Jr Grade 4 ITF Tourney

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్స్‌ గ్రేడ్‌–4 టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి శ్రీవల్లి రష్మిక ముందంజ వేసింది. థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన బాలికల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక (భారత్‌) 6–1, 6–4తో ఎవెలినా కొంటారెవా (రష్యా)పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన రెండోరౌండ్‌లో రష్మిక 6–1, 6–0తో పి కోర్సుబ్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించింది.

Advertisement
 
Advertisement
Advertisement