శ్రీలంకదే వన్డే సిరీస్ | Srilanka won one day series | Sakshi
Sakshi News home page

శ్రీలంకదే వన్డే సిరీస్

Dec 14 2014 12:44 AM | Updated on Nov 9 2018 6:43 PM

శ్రీలంకదే వన్డే సిరీస్ - Sakshi

శ్రీలంకదే వన్డే సిరీస్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే శ్రీలంక 4-2తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఆరో వన్డే

పల్లెకెలె: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే శ్రీలంక 4-2తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఆరో వన్డేలో శ్రీలంక 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 292 పరుగులు చేసింది.

సం గక్కర (112 బంతుల్లో 112; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా... దిల్షాన్ (68) రాణించాడు. ఇంగ్లండ్ 41.3 ఓవర్లలో 202 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. రూట్ (55), వోక్స్ (41) మినహా అందరూ విఫలమయ్యారు. లంక బౌలర్లలో లక్మల్ నాలుగు, సేనానాయకే మూడు వికెట్లు తీశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement