సెమీస్‌కు చేరిన శ్రీకాంత్‌, కశ్యప్‌ | Srikanth, Kashyap seal semifinal spots at India Open | Sakshi
Sakshi News home page

సెమీస్‌కు చేరిన శ్రీకాంత్‌, కశ్యప్‌

Mar 29 2019 7:08 PM | Updated on Mar 29 2019 7:15 PM

Srikanth, Kashyap seal semifinal spots at India Open - Sakshi

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్‌, పారుపల్లి కశ్యప్‌లు సెమీస్‌లోకి ప్రవేశించారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 21-23, 21-11, 21-19 తేడాతో సాయి ప్రణీత్‌పై విజయం సాధించి సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకున్నాడు.తొలి గేమ్‌ను సాయి ప్రణీత్‌ గెలిచినప్పటికీ, మిగతా రెండు గేమ్‌ల్లో శ‍్రీకాంత్‌ విజయం సాధించాడు. 62 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ తన అనుభవాన్ని ఉపయోగించి గెలుపును అందుకున్నాడు.

మరొకక్వార్టర్‌ ఫైనల్‌ పోరులో కశ్యప్‌21-16, 21-11 తేడాతో వాంగ్‌ జు వుయ్‌(చైనీస్‌ తైపీ)పై గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు. తొలి గేమ్‌ను కష్టపడి గెలిచిన కశ్యప్‌.. రెండో గేమ్‌ను సునాయాసంగా చేజిక్కించుకున్నాడు. కాగా, ఒక సూపర్‌ సిరీస్‌లో కశ్యప్‌ సెమీస్‌కు చేరుకోవడం దాదాపు నాలుగేళ్లలో ఇదే తొలిసారి.

Advertisement
 
Advertisement
Advertisement