కోచింగ్‌ చాలు... లంకకు బయల్దేరండి!

Sri Lanka Cricket asks head coach to return home from South Africa - Sakshi

హెడ్‌ కోచ్‌ హతురసింఘేకు లంక బోర్డు ఆదేశం

కొలంబో: దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రస్తుతం జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో శ్రీలంక 0–4తో క్లీన్‌స్వీప్‌కు దగ్గరైంది. దీంతో లంక బోర్డు (ఎస్‌ఎల్‌సీ) హెడ్‌ కోచ్‌ చండిక హతురసింఘేకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. బయటికి మాత్రం ప్రపంచకప్‌ ప్రణాళికలపై చర్చించేందుకు స్వదేశం రావాల్సిందిగా చెబుతున్నప్పటికీ... దాదాపు వేటు పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఎందుకంటే ఇంకా ఈ పర్యటనలో ఆఖరి వన్డేతో పాటు, మూడు టి20ల సిరీస్‌ జరగాల్సివుంది. ఈ పరిస్థితిలో సిరీస్‌ మధ్యలో అర్ధాంతరంగా లంక పయనం కావాలంటూ చండికకు ఎస్‌ఎల్‌సీ అధ్యక్షుడు షమ్మి సిల్వా ఆదేశించారు. ఐదో వన్డే ముగియగానే స్వదేశం చేరాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ఫీల్డింగ్‌ కోచ్‌ రిక్సన్‌కు జట్టు కోచింగ్‌ బాధ్యతల్ని అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పర్యటనలో వన్డే సిరీస్‌ కోల్పోయినప్పటికీ లంక జట్టు టెస్టుల్లో ఘన చరిత్రకెక్కింది. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచిన తొలి ఆసియా జట్టుగా ఘనత వహించింది.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top