దక్షిణాఫ్రికాదే టి20 సిరీస్‌  | South Africa won the second T20 match | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాదే టి20 సిరీస్‌ 

Feb 4 2019 2:42 AM | Updated on Feb 4 2019 2:42 AM

South Africa won the second T20 match - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: కీలకదశలో వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్‌... దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నెగ్గిన దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. తొలుత దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 188 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్‌ డేవిడ్‌ మిల్లర్‌ (29 బంతుల్లో 65 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), డసెన్‌ (27 బంతుల్లో 45; ఫోర్, 4 సిక్స్‌లు) మెరిశారు.

అనంతరం పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్‌ బాబర్‌ ఆజమ్‌ (58 బంతుల్లో 90; 13 ఫోర్లు, సిక్స్‌), హుస్సేన్‌ తలత్‌ (55; 7 ఫోర్లు, సిక్స్‌) దూకుడుగా ఆడారు. ఒకదశలో 16 ఓవర్లలో 147/1తో పటిష్టంగా కనిపించిన పాక్‌ తొమ్మిది బంతుల తేడాతో ఆజమ్, తలత్‌ వికెట్లను కోల్పోవడంతో విజయంపై ఆశలు వదులుకుంది. మూడో టి20 మ్యాచ్‌ బుధవారం జరుగుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement