
సౌరవ్ గంగూలీ(ఫైల్ ఫొటో)
సాక్షి, స్పోర్ట్స్ : టీ20లు లేకుండా అంతర్జాతీయ క్రికెట్‌కు మనుగడలేదని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా అద్బుతంగా ఆడి వన్డే సిరీస్ గెలిచిందని, చివరి టీ-20లో సైతం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోహ్లిసేనకు ఇదొక మంచి పర్యటన అని చెప్పారు.
‘మనీష్ పాండే, హార్దిక్ పాండ్యాతోపాటు అనేక మంది యువకులకు భారత జట్టులో అవకాశం వచ్చింది. వాళ్లు మంచి ఆటగాళ్లుగా ఎదిగేందుకు తగిన సమయం ఇస్తే.. మరో సేహ్వాగ్, హర్భజన్‌లవుతారని ఈ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోనీ అద్భుతమైన ప్లేయర్ అని కితాబిచ్చాడు. ఫిట్‌నెస్ విషయంలో అంతర్జాతీయ ప్లేయర్లకు మనోళ్లు దీటుగా ఉంటారని తెలిపారు. మహిళా క్రికెటర్లపై సైతం గంగూలీ ప్రశంసలు జల్లు కురిపించారు. మహిళా క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారని కితాబిచ్చారు. ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ కౌర్ సిక్స్ బాదినట్టుగా ఎవరైనా కొట్టగలరా? అని దాదా ప్రశ్నించాడు.